జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలంలోని రాజు గురువాయి పల్లె గ్రామంలోని పంచాయతీ కార్యాలయం వద్ద గురువారం శనగల కొనుగోలు కేంద్రాన్ని ఎర్రగుంట్ల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ హరి ప్రసాద్ రెడ్డి , మాజీ ఎంపీపీ ముని రాజారెడ్డి ప్రారంభించారు. రైతులకు గిట్టుబాటు ధరను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం శనగలకు కనీస మద్దతు ధర రూ. 5335లు ప్రకటించిందని, ఈ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, పార్టీ నాయకులు భాస్కర్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి , హరి నారాయణ రెడ్డి పాల్గొన్నారు.