పులివెందులలో నిర్మిస్తున్న జగనన్న కాలనీని గురువారం అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యేతో పుదుర్తి ప్రకాష్ పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ తో కలిసి ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. జులై నెల ఆఖరి నాటికి అన్ని ఇండ్లను నిర్మించి ఇస్తామన్నారు. అనంతరమైన గుత్తేదారులతో మాట్లాడుతూ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదన్నారు. ఏవైనా మెటీరియల్ తక్కువ వస్తే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. నాణ్యత లోపించకుండా చూడాలన్నారు. రూములు కట్టే గోడలను నీటితో బాగా క్యూరింగ్ చేయాలన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ తో మాట్లాడుతూ ఇంటి నిర్మాణాలు వేగవంతం చేసేందుకు బేల్దారులను. సమకూర్చేందుకు సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఖాదర్, సిద్దయ్య, దాసరి చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.