లింగాల మండలంలోని కర్ణ పాపాయ పల్లె గ్రామంలో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో గండి క్షేత్ర కమిటీ సభ్యుడు ఎం. అంకాల రెడ్డి అనే రైతుకు చెందిన భారీ సంప్ షీట్ అగ్నికి ఆహుతైంది. వివరాల్లోకి వెళితే గ్రామ సమీపంలో కొండ వద్ద ఆయన పొలంలో పండ్ల తోటల సాగుకు భారీ సంపు నిర్మించుకున్నారు. సంపులో నీరు నిలువ ఉంచుకునేందుకు సుమారు రూ. 7 లక్షల విలువచేసే ప్లాస్టిక్ షీట్ ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కొండకు నిప్పు పెట్టడంతో మంటలు ప్లాస్టిక్ షీటుకు అంటుకోవడంతో షీటు పూర్తిగా కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.