ప్రతి వ్యక్తి రోజులో 5 నుంచి 19 సార్లు ఆవలిస్తుంటాడు. అయితే, ఎక్కువగా ఆవులించడం అనేది కూడా కొన్ని ఔషధాల దుష్ప్రభావం అని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అధిక ఆవులింత పగటి నిద్రకు కారణమయ్యే అబ్స్రక్టివ్ స్లీప్ అబ్నియా వంటి స్లీప్ డిజార్డర్ కు సంకేతం కావచ్చట. అలాగే మెటబాలిజానికి సంబంధించిన వ్యాధులకు అతిగా ఆవులించడం కూడా కారణమంటున్నారు. సరిగ్గా నిద్రపోవడం వల్ల ఈ సమస్యలు నివారించొచ్చని చెబుతున్నారు.