ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం సంతనూతలపాడు మండలం మన్నంవారిపాలెం కాలువ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ మన్నంవారిపాలెం గ్రామానికి చెందిన నిడమనూరు లక్ష్మీ నరసయ్య (76) పని నిమిత్తం ఒంగోలుకు ద్విచక్రవాహనంపై ఒంగోలుకుబయలుదేరాడు. ఈ క్రమంలో పొదిలి నుంచి ఒంగోలు వస్తున్న ఆర్టిసి బస్సు మన్నంవారిపాలెం మూలమలుపువద్ద బైకును ఢీకొట్టింది. ఈ ఘటనపై శనివారం పోలీసులు విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa