సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెబుతున్న మాటలకు ఆచరణలో జరుగుతున్న వాస్తవాలకు నమ్మకం లేకనే ఉద్యామానికి సాద్ధపడాల్సి వస్తోందని ఏపీజేఏసీ-అమరావతి జిల్లా నాయకులు స్పష్టం చేశారు. నెల్లూరులోని ఏపీఆర్‌ఎ్‌సఏ భవన్‌లో వివిధ సంఘాల నాయకులతో కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ నెల 26న విజయవాడలో ఏపీజేఏసీ-అమరావతి సమావేశమై పోరాటానికి కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కమిటీ ఎలాంటి పోరాటాలకు పిలుపునిచ్చినా ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa