సాధారణంగా దేవునికి అటుకులు, పరమాన్నం, బెల్లం, కొబ్బరి ఇలా నైవేద్యం సమర్పిస్తాం. కానీ కేరళలోని ‘తెక్కన్ పలని’ బాలసుబ్రహ్మణ్య ఆలయంలో భక్తులు చాక్లెట్స్ నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరేళ్ల క్రితం ఓ బాలుడు బాలమురుగన్ కు మంచ్ చాక్లెట్ అందించిన తర్వాత దేవుడు అతన్ని అనుగ్రహించాడని ఇక్కడి భక్తుల నమ్మకం. దీంతో ఈ స్వామి మంచ్ మురుగన్ గా ప్రసిద్ధి చెందారు. కులమతాలకు అతీతంగా భక్తులు స్వామికి చాక్లెట్స్ సమర్పించి తమ కోర్కెలు తీర్చాలని వేడుకుంటారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa