రెండు రోజుల భారత్ పర్యటనలో భాగంగా శనివారం దిల్లీకి చేరుకున్నారు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్. ఆయనకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ఈ పర్యటనలో ఇరుదేశాల వ్యాపార వాణిజ్యం, పెట్టుబడులు, కొత్త టెక్నాలజీ, ఇంధనం, రక్షణ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించడంపై చర్చలు జరపనున్నారు. కాగా 2021 డిసెంబర్ లో జర్మనీ ఛాన్సలర్ అయిన తర్వాత షోల్జ్ భారత్ కు రావడం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa