పామును చూసి భక్తులు పరుగులు తీశారు. ఈ ఘటన విజయవాడ ఇంద్రీకీలాద్రి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో చోటు చేసుకొంది. దేవాలయంలోని క్యూలైన్లో పొడవైన పాము కనిపించడంతో భక్తులు పరుగులు తీశారు. భక్తుల అరుపులతో గందరగోళం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు క్యూలైన్ ను ఖాళీ చేయించి, ఆ పామును ఓ కర్ర సాయంతో కిటీకీ ద్వారా బయటికి పంపించి వేశారు. కాగా, పాము ఆ కిటీకీలోంచే క్యూలైన్లో ప్రవేశించిందని భక్తులు వెల్లడించారు. పామును వెంటనే బయటికి పంపించివేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇంద్రకీలాద్రిపై గతంలోనూ పాములు కనిపించిన సంఘటనలు జరిగాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa