ఏపీలో ఇంటింటికీ రేషన్ సరఫరా చేస్తున్న ఎండీయూ ఆపరేటర్లకు కూడా వాహనమిత్ర పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎండీయూ వాహనాల బీమా ప్రీమియం చెల్లింపును వాహనమిత్ర పథకం కిందకు చేర్చి 2021 నుంచి అమలు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ ఏడాది జూలైలో సొంతంగా ఆటో, ట్యాక్సీలు నడుపుకునే వారితో పాటు ఎండీయూ ఆపరేటర్లకు నిధులు చెల్లిస్తామని మంత్రి కారుమూరి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.