భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగనున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. తాజగా ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే శత్రువులకు అందిస్తున్న నిధులను రద్దు చేస్తానని ప్రకటించారు. 'బైడెన్ ప్రభుత్వం పాకిస్తాన్ కు ఆయుధాల పంపిణీ మళ్లీ ప్రారంభించింది. అమెరికన్లు చెల్లించే పన్ను పర్యావరణ పరిరక్షణ పేరుతో చైనాకు మళ్లిస్తున్నారు' అని ఆమె ఆరోపించారు.