ఛత్తీస్గఢ్ లోని రాయ్ పూర్ లో జరిగిన ప్లీనరీలో కాంగ్రెస్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇకపై పార్టీలో 50 శాతం పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, మైనార్టీలకు కేటాయించాలని నిర్ణయించింది. అంతే కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కూడా పెంచింది. ప్రస్తుతం 23గా ఉన్న వర్కింగ్ కమిటీ సభ్యుల సంఖ్యను 35కు పెంచింది. వీరిలో 18 మంది ఎన్నికల ద్వారా, 17 మంది నామినేషన్ ద్వారా ఎన్నికవుతారు.