ఉల్లిపాయలో యాంటీ బయాటిక్, యాంటీ సెప్టిక్, యాంటీమైక్రోబియాల్ లక్షణాలు ఉంటాయి. దీని వల్ల ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఉల్లిలో ఐరన్, సల్ఫర్, రాగి, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి, విటమిన్ సి సమృద్ధిగా ఉంటాయి. ఉల్లిపాయ ఎర్ర రక్తకణాల ఉత్పత్తి పెరిగేందుకు సహాయపడుతుంది. శరీరంలో ముఖ్య భాగాలకు ఎక్కువ ఆక్సిజన్ సరఫరా అయ్యేలా చేస్తుంది. ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకుంటే రక్తహీనత, నిద్రలేమి, దంతాల సమస్యలు పోతాయి. శరీరంలోని కొవ్వును తగ్గించేందుకు, గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉండేందుకు ఉల్లి సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే కాల్షియం ఎముకల బలాన్ని పెంచుతుంది. పైల్స్ నివారణకు కూడా ఉల్లిపాయ పనిచేస్తుంది.