చేపలను రెగ్యులర్ గా తినడం వల్ల పలు వ్యాధులను దూరం పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. వారానికి మూడుసార్లు చేపలు తినడం వల్ల కిడ్నీ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఐరన్ తో పాటు విటమిన్ డి సైతం చేపలలోఉంటుంది. ఇవి కిడ్నీల ఆరోగ్యానికి దోహదపడతాయి. చేపలలో ఎక్కువగా ఉండే ఒమేగా-3 పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు కిడ్నీలతో పాటు గుండెకు మేలు చేస్తాయి.