పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంతో విలవిలలాడుతోంది. ఆ దేశంలో ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కాగా, విదేశీ మారకం నిల్వలు తగ్గడంతో ఇటీవల ఫార్మా సహా వివిధ రంగాలకు చెందిన దిగుమతులను పాక్ రద్దు చేసింది. దీంతో ముఖ్య ఔషధాలకు కొరత రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇన్సులిన్, డిస్ప్రిన్, రివోట్రిల్, హెపామర్జ్, టెగ్రాల్, కాల్ పాల్ మొదలైన మందులకు తీవ్ర కొరత ఏర్పడింది.