అధికార వైసీపీకి ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాదరెడ్డి తొత్తుగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నంలో విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో జరిపిన సమావేశంలో వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రోటోకాల్ కు తూట్లు పొడిచారని పేర్కొన్నారు. నియంత్రించాల్సిన ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని విమర్శించారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు