నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలో వచ్చే ఉగాదికి 1, 972 గృహాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు గృహ నిర్మాణ శాఖ నర్సీపట్నం డిఈ శ్రీఫణి ఆదివారం తెలిపారు. నియోజకవర్గంలో 160 లేఔట్లలో 8, 979 గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు ఇప్పటివరకు 952 గృహాలు పూర్తికాగా మిగిలినవి వివిధ దశలో ఉన్నాయన్నారు. ఎప్పటికప్పుడు వీటి ప్రగతిని ఆన్ లైన్ లో నమోదు చేస్తున్నామన్నారు.