బ్యాంకులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అనంతపురం జిల్లాలోని ఉర్వకొండ సహకారి మున్సిపల్ బ్యాంక్, మహారాష్ట్రలోని శంకర్రావ్ మోహితే పాటిల్ సహకరి బ్యాంక్‌లపై ఆంక్షలు విధించింది. ఇక నుంచి ఈ బ్యాంక్‌ల కస్టమర్లు తమ ఖాతా నుంచి రూ.5 వేల కంటే ఎక్కువ విత్‌డ్రా చేయలేరు. ఈ రెండు బ్యాంకులు ప్రస్తుతం ఆర్థిక సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నాయని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.