కేరళలోని ఓ ఆలయంలో ఆచారాలను నిర్వహించేందుకు రోబోటిక్ ఏనుగును ఏర్పాటు చేశారు. ఈ ఏనుగును రోజువారి ఆచారాలు నిర్వహించేందుకు వినియోగించనున్నారు. ఈ రోబోను త్రిసూర్ లోని శ్రీకృష్ణ ఆలయానికి బహూకరించారు జంతు హక్కుల ఉద్యమ సంస్థ 'పెటా'కు చెందిన కొందరు. కేరళలో రోబో ఏనుగు ఉన్న ఆలయం ఇదొక్కటే కావడం విశేషం. ఈ రోబో ఏనుగుకు 'ఇరింజదపల్లి రామన్' అని పేరు పెట్టారు. ఇనుపచట్రానికి రబ్బరు తొడుగు వేసి దీనిని రూపొందించారు.