మండల కేంద్రమైన బత్తలపల్లిలో రెండు రోజులుగా ఓ మైనర్ బాలిక కనిపించడంలేదు. దీనిపై తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ టీవీ శ్రీహర్ష తెలిపారు. బత్తలపల్లి వడ్డెర కాలనీలో నివాసముంటున్న లక్ష్మీదేవి తన భర్త గంగాధర్‌తో విడిపోయి కుమార్తె, కుమారుడితో కలసి జీవిస్తోంది. ఈ నెల 24వ తేదీన లక్ష్మీదేవి బేల్దారి పనులకు వెళ్లింది. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చాక కుమార్తె కనిపించలేదు. దీంతో బంధువులు, చుట్టుప క్కల వారి సాయంతో గాలించింది. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.