గుత్తి పట్టణ సరిహద్దు కర్నూలు జిల్లా మద్దికేర మండలం బాటతాండా గ్రామానికి చెందిన సారాబాయి అను వివాహిత కుటుంబ సమస్యలు కారణంగా సోమవారం ఉదయం క్రిమి సంహారక మందు సేవించి ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. బాట తాండా గ్రామానికి చెందిన సారాబాయి కుటుంబ సమస్యల కారణంగా మనస్థాపం చెంది ఇంటిలోని క్రిమి సంహారక మందు సేవించింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యుల వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిం చారు. ప్రథమ చికిత్సలు అనంతరం వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.