ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి అదే ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతే కాదు పవన్ పోటీ చేసే నియోజకవర్గాలు కూడా సిద్దమైపోయాయి. తాజా సమాచారం మేరకు ఆ రెండు నియోజకవర్గాల్లో పవన్ ఈ సారి పోటీ చేస్తే రెండు చోట్ల నుంచి గెలుపు అవకాశాలు చాలా మెరుగ్గా ఉన్నట్లు స్ధానికంగానే అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ రెండు నియోజకవర్గాలపై ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ పెరుగుతోంది.