ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం కొత్తపల్లి గ్రామ సమీపంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. సోమవారం అనుమతులు లేకుండా ఇసుకను డంపుగా చేసుకొని ప్రైవేటుగా విక్రయిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న ధర కాకుండా అధిక మొత్తంలో ధరలు వసూలు చేయడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఇసుక అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు వ్యక్తులు అమ్ముతున్నాను ఇసుకను కొనవలసిన పరిస్థితులు తలెత్తయని అంటున్నారు. సంబంధిత అధికారులు ప్రభుత్వ అందిస్తున్న ఇసుకను అందుబాటులో ఉంచి ఇసుక మాఫియా జోరుకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు.