గన్నవరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో తెలుగుదేశం అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ను పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో పట్టాభి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ఈరోజు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. కొద్దిరోజుల క్రితం గన్నవరంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో పట్టాభితోపాటు తెలుగుదేశం నేతలపై సీఐ కనకరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను కులం పేరుతో దూషించారని ఆరోపించారు. దాంతో పట్టాభి సహా 13 మందిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్లతో కేసు నమోదు చేశారు.