యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో ఏదో రోజు సోమవారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని కన్నులపండువగా నిర్వహించారు. ఆలయంలో నిత్యం ఆరాధనలు ముగిసిన తర్వాత స్వామి అమ్మ వార్లను సుందరంగా అలంకరించి, మొదట అశ్వవాహనంపై మాడవీధుల్లో ఊరేగించారు, తర్వాత తూర్పు రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామిఅమ్మవార్లను ఎదురెదురుగా ఉంచి ఎదుర్కోలు కార్యక్రమం ప్రారంభించారు. స్వామివారి తరఫున ఆలయ ఈవో గీతారెడ్డి, అమ్మవారి తరఫున ఆలయ చైర్మన్ నర్సింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం రాత్రి 8 గంటలకు నరసింహుడి కల్యాణం నిర్వహించాల్సిందిగా సుముహూర్తాన్ని ఖరారు చేశారు. అంతకుముందు ఉదయం జగన్మోహినీ అలంకార సేవ వేడుకగా జరిగింది.