ప్రతి రోజు క్యారెట్ జ్యూస్ తాగితే మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు పోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ రసంలో విటమిన్ ఎ, సి, డి, కె ఉంటాయి. క్యారెట్ లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా ఉంటుంది. ఇది శరీర బరువును నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ జీర్ణవ్యవస్థను శక్తిమంతం చేస్తుంది. పొట్ట సమస్యలకు చెక్ పెడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి శరీరాన్ని కాపాడుతుంది.