రాష్ట్రంలో రైతులను అడుగడుగునా దగా చేసిన ముఖ్యమంత్రి వాటికి సమాధానం చెప్పిన తర్వాతే తెనాలి రావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... రుణ మాఫీ వాయిదాలను ఎగ్గొట్టడం, రైతు భరోసా చెల్లింపుల్లో మోసం, కౌలు రైతుల సంఖ్యను భారీగా తగ్గించి సాయం అందించడం, గిట్టుబాటు ధర ఒట్టి మాట అవ్వడం, ఆర్‌బీకేలు నిర్వీర్యమవడం వంటి అంశాలను ఆలపాటి ప్రశ్నించారు. కాడి భుజాన వేసుకొని కాయకష్టం చేసే రైతులకు కులాలు, మతాలు అంటగట్టిన చరిత్ర జగన్‌దని ఆరోపించారు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసుకొన్నా ఈసారి రైతులు జగన్‌రెడ్డిని నమ్మే సమస్య లేదని ఆలపాటి స్పష్టం చేశారు.