తమ చదువుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలను అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మార్కాపురం సబ్ కలెక్టర్ సేతు మాధవకు శివారెడ్డి అనే విద్యార్థి వినతి పత్రంమంగళవారం అందజేశారు. తాను ఖమ్మం మండలంలో గల ఓ కళాశాలలో ఎంబీఏ విద్యను పూర్తి చేసినట్లు కళాశాలలో తాను చేసేటప్పుడు ఎటువంటి ఫీజు అవసరం లేదని కళాశాల యాజమాన్యం తెలియజేశారని కానీ ఇప్పుడు సర్టిఫికెట్లు అడుగుతుంటే ఫీజు చెల్లించాలని కళాశాల యాజమాన్యం చెబుతున్నట్లు విద్యార్థి తెలిపాడు. తనకు తగిన న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు. తనకు న్యాయం చేయకురాలని కోరారు.