ఎన్నికలు సమీపిస్తున్న వేళ కర్ణాటక ప్రభుత్వంపై భారీ పిడుగు పడింది. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ దాదాపు 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు నేటి నుంచి సమ్మె చేపట్టనున్నారు. 7వ వేతన సంఘం నివేదిక అమలు, పాత పెన్షన్ స్కీం మార్చడం, 40 శాతం ఫిట్ మెంట్ వంటి ప్రధాన డిమాండ్లను ఉద్యోగులు ప్రభుత్వం ముందుంచారు. నిరసనలతో ప్రభుత్వ ఆస్పత్రులు, రెవెన్యూ, అత్యవసర సేవలకు అంతరాయం కలగనుంది.