ఎక్కువగా కారం, పులుపు, ఉప్పు, పులియబెట్టిన, వేయించిన ఫాస్ట్ ఫుడ్ తినడాన్ని మానుకోండి. ఏ ఆహారమైనా సరే సమతుల్యంగా తినండి. అతిగా తిన్న కూడా ప్రమాదమే. పుల్లని పండ్లకు సాధ్యమైంత దూరంగా ఉండటం మేలు. సమయానికి భోజనం చేయడం మంచిది. ధూమపానం, ఆల్కహాల్, టీ, కాఫీ, వంటివి తీసుకోవడం మానుకోండి. పడుకునే ముందు భోజనం చేయవద్దు. మాంసాహారం ఎక్కువగా తినకపోవడమే ఉత్తమం.