మైక్రో ఇన్నోవేటివ్ ప్రాజెక్టులో భాగంగా వైయస్సార్ జిల్లాలో మొత్తం 4525 ప్రాజెక్టులు చేయగా అందులో చాపాడు మండలం మొరాయిపల్లి ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు గా పనిచేయుచున్న ఎమ్ నాగలక్ష్మి దేవి తయారుచేసిన బేసిక్ మ్యాథమెటిక్స్, పర్మినెంట్ టిఎల్ఎం ప్రాజెక్టు జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎంపిక కావడమే కాకుండా రాష్ట్రస్థాయిలో 26 జిల్లాల నుండి వచ్చిన ప్రాజెక్టుల నుండి మొదటి 15 ప్రాజెక్టులు ఎంపిక చేయగా అందులో కూడా ఒక ప్రాజెక్టుగా ఎంపిక కావడం జరిగింది.
ఈ విధంగా ఎమ్ నాగలక్ష్మి దేవి ఎంతో వినూత్నంగా ఆలోచించి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నాడు నేడు మొదటి దశలో విద్యార్థులు ప్రాథమిక దశలో గణితంలో ఎదుర్కునే సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించడానికి ఎంతో చక్కగా పర్మనెంట్ టి ఎల్ ఎం ఏర్పాటు చేయడం వారికి వృత్తిపట్ల ఉండే అంకితభావం నిబద్ధత అభినందనీయమని ఇటువంటి మరిన్ని ప్రాజెక్టులు తీసుకురావాలని బుధవారం మొరాయి పల్లె సర్పంచ్ యర్రగుడి శ్రీనివాసులు రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ విధంగా ఒక ప్రాజెక్ట్ మొరాయిపల్లి పాఠశాల నుంచి రాష్ట్రస్థాయిలోకి ఎంపిక కావడం రాష్ట్రస్థాయిలోని 15 ప్రాజెక్టులలో ఒకటి కావడం తమ ఊరికి ఎంతో గర్వకారణమని సర్పంచ్, ఊరి పెద్దలు, తల్లిదండ్రులు అభినందనలు తెలియజేశారు.