కొంతమంది తమ పెంపుడు జంతువులకు చాక్లెట్లు తినిపిస్తుంటారు. అయితే శునకాలకు చాక్లెట్లు తినిపిస్తే వాటి ప్రాణాలు పోయే ప్రమాదముందని ఒక పరిశోధనలో తేలింది. చాక్లెట్ లో ఉండే థియోబ్రోమిన్ అనే పదార్థం కుక్కలకు విషపూరితమైనది. దీనిని మానవులు జీర్ణం చేసుకున్నంత సులభంగా కుక్కలు జీర్ణం చేసుకోలేవు. థియోబ్రోమిన్ శునకాల నాడీ వ్యవస్థ, గుండె, మూత్రపిండాలపై ప్రభావం చూపుతుంది.