ఎన్నికల కమిషనర్ల నియామకాలపై ప్రస్తుత విధానాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, సీజేఐ సభ్యులుగా ఉన్న కమిటీ ఈసీలను నియమించాలని ఆదేశించింది. ఇందుకోసం పార్లమెంటులో చట్టం చేయాలని ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రతిపక్ష నేత లేకపోతే విపక్షంలో మెజార్టీ పార్టీ సభ్యుడు కమిటీలో ఉండాలని కమిటీ సిఫార్సులతో ఈసీలను రాష్ట్రపతి నియమించాలని పేర్కొంది.