రాజధాని ప్రాంతంలో శునకాల బెడద పెరిగి పోయింది. ముఖ్యంగా వీధి కుక్కలు విపరీతంగా పెరిగిపోతుండడంతో మార్కెటుకు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ప్రజలు భయాందోళ చెందు తున్నారు. అదమరిచి వాహనాలపై వెళ్లే వారిని కుక్కలు వెంబడిస్తున్నాయని స్థానికులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. కుక్కల భారీ నుంచి ప్రజలను రక్షించాలని పంచాయతీ అధికారులకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.