భారత్ లో మరో వైరస్ కలకలం రేపుతుంది. పశ్చిమ బెంగాల్ లో అడెనో వైరస్ కారణంగా ఏడుగురు చిన్నారులు ఒక్కరోజులో మరణించారు. ఇప్పటి వరకు 5213 కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 మంది మరణించారు. జలుబు, గొంతునొప్పి, ఫ్లూ, ఊపిరితిత్తుల సమస్యలు ఈ వ్యాధి లక్షణాలు. ఊపిరితిత్తుల సమస్యతో శ్వాసకోశ సమస్య వచ్చి మరణించే అవకాశం ఉంది. 121 ఆస్పత్రుల్లో 5 వేల బెడ్లు, 600 మంది డాక్టర్లను అందుబాటులో ఉంచామని బెంగాల్ ప్రభుత్వం తెలిపింది.