రాష్ట్రంలోనే మొదటగా గడప గడపకు మన ప్రభుత్వం పూర్తి చేసిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిని ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయంలో బుధవారం సన్మానించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మిదేవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు 213 రోజులపాటు ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించరన్నారు. రాష్ట్రంలోనే ప్రధమ స్థానంలో నిలిచిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి, వైసీపీ పట్టణాధ్యక్షుడు కామిశెట్టి బాబు, వార్డు కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జిలు, తదితరులు పాల్గొన్నారు.