పన్నెండు ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించారు. రెండేళ్లుగా కాస్త దూరమయ్యారు. ఈక్రమంలో ఆమె ఇంకొకరితో చనువుగా ఉండటాని చూసి జీర్ణించుకోలేకపోయాడు. ఆమె తనకు దూరమైందని అక్కసు పెంచుకుని హతమార్చేందుకు పక్కా ప్రణాళిక రూపొందించాడు. తన కారుతో ఢీకొటి కొట్టి హతమార్చాడు. పన్నేడేళ్లు కలిసి ఉన్నామనే కనికరం లేకుండా అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన ఒంగో లు నగరంలో కలకలం రేపింది. తొలుత రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు కావడంతో యావత్ ప్రజానీకం నివ్వెరపోయారు. ఎట్టకేలకకు పథకం ప్రకారమే హ్యత జరిగిందంటూ ఇరువురు నిందితులను పోలీసులు అరెస్టు చేయడంతో నిజం బయటపడింది. ఈ మేరకు బుధవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ యు.నాగరాజు ఇందుకు సంబంధించి న వివరాలను వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందలూరు మండలం జోగన్నపాలెంనకు చెందిన నాయిన పాటి లక్ష్మీరమ్య అలియాస్ రమ్యకృష్ణ హత్య కేసులో ఇరువురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్థానిక మంగమూరురోడ్డులోని విజయటవర్స్ లో నివాసం ఉంటున్న వడ్లమూడి శ్రీనివాసులు, కటారి వెంకటేశ్వరరావులను అరెస్టు చేసినట్లు ఆయన చెప్పారు.