చత్తీస్‌గడ్ రాష్ట్రం నయారాయ్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశారని ఆపార్టీ రాజమహేంద్రవరం అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ తెలిపారు. ప్లీనరీ సమావేశాలకు వెళ్లివచ్చిన ఆయన బుధవారం రాజమహేంద్రవరం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూధర్, పీసీసీ కార్యదర్శి ముళ్ళ మాధవ్‌లు మాట్లాడుతూ ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే , మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు దిశనిర్ధేశం చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారని చెప్పారు. అలాగే దేశ సంపదను అదానికి దోచిపెడుతున్న మోది విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 6 నుంచి 10వ తేదీవరకు నిరసనలు, 13న చలో రాజ్ భవన్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సమావేశంలో అనపర్తి, గోపాలపురం ఇన్‌చార్జీలు డాక్టర్ వడయార్, జ్యేష్ట సతీష్ బాబు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నలబాటి శ్యామ్, అబ్దుల్లా షరీఫ్, దేవత సుధాకర్, కాటం రవి, పిట్టా రామారావు, జక్కంపూడి సత్తిబాబు, యాళ్ళ మాసరయ్య, దాసరి ప్రవీణ్, డాక్టర్ వాసు, రాజు పాల్గొన్నారు.