కొవ్వూరు సంస్కృత పాఠశాలలో స్వామి వివేకానంద యువజన సమితి, సైంటిఫిక్ స్టూడెంట్స్ సొసైటీ సంయుక్తంగా ఇన్‌స్పైర్ - 2023 జాతీయ సైన్సు దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఇస్రో శాస్త్రవేత్త విష్ణువర్జుల రామమూర్తి జాతీయ అభివృద్ధిలో ఇస్రో పాత్ర అనే అంశంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఎస్.జి. శ్రీనివాస్ మాట్లాడుతూ.... పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు విజ్ఞాన దృక్పథాన్ని అలవర్చుకుని భావిభారత శాస్త్రవేత్తలుగా ఎదగాలన్నారు. స్వామి వివేకానంద యువజన సమితి కార్యదర్శి ఎస్. రాఘవేంద్రరావు మాట్లాడుతూ సైన్సు పట్ల అభిరుచి కల్గిన పిల్లలకు ప్రతి ఆదివారం ప్రయోగాలు, నమూనా తయారీ, సంస్కృతం, దేశభక్తి వంటి అం శాలపై శిక్షణను అందజేయనున్నామన్నారు. జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పాఠశాలల్లో నిర్వహించిన శాస్త్ర సాంకేతికత, పర్యావరణ సమతుల్యత అనే అంశాలపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో దోర్భల ప్రభాకరశర్మ, త్రినాథరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసమూర్తి పాల్గొన్నారు.