రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిన ఘనత జగన్‌రెడ్డికే దక్కిందని కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణారావులు విమర్శించారు. బుధవారం కొవ్వూరు పట్టణంలోని 13వ వార్డులో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమణి రామకృష్ణారావులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో అంబేడ్క ర్ రాసిన రాజ్యాంగం నడవడం లేదు. 1861లో రాసిన బ్రిటీష్ రాజ్యాంగం ప్రకారం పోలీస్ చట్టాన్ని ఉపయోగించి ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు. వైపీసీ నిరంకుశ పాలనకు తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, పొట్రు శ్రీనివాసరావు, రాజాన శ్రీనివాస్, మరపట్ల కళాధర్ చక్రవర్తి, గెల్లా సురేష్, పెనుమాక జయరాజు, మాదిరెడ్డి సతీష్, మద్దిపట్ల సురేష్, కిలారి రమణ, తదితరులు పాల్గొన్నారు.