ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం బెంగళూరు - కాచిగూడ మధ్య ఓ ప్రత్యేక రైలును నడుపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బెంగళూరు - కాచిగూడ (నెం. 06523)ప్రత్యేక రైలును ఈనెల 3, 5 తేదీలలో నడు పనున్నట్లు తెలిపారు. ఈ రైలు బెంగళూరులో ఆయా తేదీల్లో మధ్యాహ్నం 3-30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5-20 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని తెలిపారు. అదేవిధంగా తిరుగు ప్రయాణం రైలు (నెం. 06524) కాచిగూడలో 4, 6 తేదీలలో రాత్రి 10-55 గంటలకు బయలు దేరి మరుసటి రోజు ఉదయం 11-45 గంటలకు బెంగళూరు చేరుకుం టుందని తెలిపారు. ఈ రైలు యల్హాంక, హిందూపురం, ధర్మవరం, అనంతపురం, గుంతకల్లు, మంత్రాలయం రోడ్డు, రాయచూరు, గద్వాల, వనపర్తి రోడ్డు, మహబూబ్ నగర్, షాద్ నగర్, ఉందా నగర్ స్టేషన్ల మీదు గా ప్రయాణిస్తుందని అధికారులు తెలిపారు.