రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆగన్మోహన్రెడ్డి అరాచక పాలనకు చరమగీతం పాడి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుండామని టీడీపీ మండల నా యకులు పేర్కొన్నారు. బుక్కపట్నంలో జగనాసుర రక్తచరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ. రాష్ట్రంలో ప్రజలధన, మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై అనవసరమైన కేసులు పెడుతూ వారి గొంతునొక్కుతున్నారన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్ష్యాలను తారుమారు. చేస్తూ అసలైన నిందితులను కాపాడు తున్నారన్నారు. కోర్టులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. సైకో పాలన పోయి సైకిల్ పాలన వస్తేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడుగలమన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ మల్లిరెడ్డి, జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ, తెలుగుమహిళా అధ్యక్షురాలు లావణ్యగౌడ్, నాయకులు కాయగూరలచంద్ర, సయ్యదా బాషా, వెంకట రాముడు, కరణం శ్రీరాములు, కేశవనాయుడు, సుదీర్, వాజీద్, జయరాం పాల్గొన్నారు.