శ్రీకాకుళం జిల్లా, కోటబొమ్మాళి మండలం, నారాయణవలస గ్రామ పంచాయతీ తుంబయ్యపేట ఎస్సీ కాలనీకి చెందిన ఏఎన్ఎం గంగ రాపు పద్మావతి (40) విద్యుదాఘాతంతో మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే..... గురువారం ఉదయం స్నానం చేసేందుకు బాత్రూమ్లో వేడినీటి కోసం హీటర్ ఆన్చేయగా షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. పద్మావతి జలుమూరు మండలం తలిల రియా పంచాయతీలో ఏఎన్ఎంగా విధులు నిర్వహిస్తు న్నారు. ఈమె భర్త అప్పన్న కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు.. పెద్ద కుమా రుడు ప్రసాద్ బీఫార్మసీ, చిన్నకుమారుడు కార్తీక్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఆమె భర్త అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ ఎస్కే మహ్మద్ ఆలీ తెలిపారు.