ప్రతి ఏటా రూ.12,000లు నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తామని మాటిచ్చిన జగన్ అన్నదాతల ఓట్లతో ముఖ్యమంత్రి అయ్యాక రూ.7,000 మాత్రమే ఇస్తూ మడమ తిప్పారని బీజేపీ మండిపడింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇస్తోన్న రూ.6,000ల కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు తమ ప్రభుత్వానివిగా చెప్పేందుకు రూ.కోట్లతో ఇస్తోన్న ప్రకటనల డబ్బుతో రైతులకు ఎంతో మేలు జరిగేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు అన్నారు. విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.