తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌లో ధరలు మండిపోతున్నాయి. ఇక బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. 24 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2.06 లక్షలు (పాకిస్థాన్ కరెన్సీలో)లకు చేరింది. అమెరికా డాలర్‌తో పోల్చితే పాకిస్థాన్ రూపాయి విలువ దారుణంగా పడిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు స్థానిక మీడియా పేర్కొంది. ప్రస్తుతం డాలర్‌తో పాక్ రూపాయి మారకం విలువ రూ.280కి పైన ట్రేడవుతోంది.