పెళ్లి మండపంలో ఏర్పాటు చేసిన డీజే సౌండ్ వరుడి ప్రాణాలు తీసిన విషాద ఘటన బీహార్ లో చోటుచేసుకుంది. మణితార్ గ్రామానికి చెందిన సురేంద్ర కుమార్ అనే యువకుడికి అదే ప్రాంతానికి చెందిన యువతితో ఇందర్వాలో వివాహం జరుగుతోంది. అయితే, పెళ్లికి వచ్చిన యువకులు విపరీతంగా డీజే పెట్టి డ్యాన్సులు వేస్తుండగా వరుడు కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించగా డీజే సౌండ్ వల్లే వరుడి గుండె ఆగినట్లు వైద్యులు తెలిపారు.