ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. ఉత్తర జకార్తాలో ఓ ఆయిల్ డిపోలో భారీ పేలుడు సంభవించింది. భారీ వర్షంతో పాటు పిడుగులు పడటంతో ఈ మంటలు వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. మంటలు చుట్టుపక్కల నివాసాలకు వ్యాపించటంతో భయంతో ప్రజలు పరుగులు తీశారు. సహాయసిబ్బంది 37 ఫైర్‌ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa