కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు తీపికబురు చెప్పింది. ఉద్యోగుల్లోని కొందరికి పాత పెన్షన్ విధానంను ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. జాతీయ పెన్షన్ స్కీమ్ అమలుకు ముందు చేరిన ఉద్యోగులకు కేంద్రం ఈ అవకాశం కల్పించింది. దీంతో సెంబర్ 22, 2003కు ముందు వెలువడిన ఉద్యోగ నియామక ప్రకటనల ఆధారంగా నియమితులైన వారు OPSకు అర్హులు. ఈ ఏడాది ఆగస్టు 31లోగా ఇందుకోసం దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది.