మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం వెలుగు చూసింది. అర్బన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. చిలకలూరిపేట పట్టణంలోని గుర్రాల చావిడి ప్రాంతానికి చెందిన షేక్ నాగుల్ మీరా(26) కూలి పనులు చేస్తూ ఉంటాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై ఇంట్లో వారిని మద్యం కోసం డబ్బులు అడుగుతూ వేధిస్తున్నాడు. ఈనెల ఒకటో తేదీ తండ్రి షేక్ గౌస్ బాషాను మద్యం కోసం డబ్బులు అడగక తండ్రి మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఉన్న పురుగు మందును సమీపంలో ఉన్న పొలాల్లో సేవించాడు అనంతరం తల్లికి ఫోన్ చేసి సమాచారం అందించాడు. బంధువులు చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.