బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. మండలంలో యాజమాన్య పద్ధతులపై నిర్వహించుచున్న పొలంబడిని శాస్త్రవేత్తలు మరియు వ్యవసాయా అధికారులు సందర్శించారు. రబి వేరుశనగ పంట ప్రస్తుతం 90 రోజుల దశలో ఉన్నదని మచ్చ తెగులు వచ్చే అవకాశం ఉన్నందులవలన రైతు సోదరులు తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే హేక్సకొనాజోలు, కాంటాఫ్ 2ఎంఅల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలని శాస్త్రవేత్త రాధిక తెలియజేశారు. అనంతపురం సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటరాముడు, రైతు శిక్షణ కేంద్రం ఎడీఎ శైలజ, వ్యవసాయ అధికారులు శంకరలాల్, శ్రీనివాసులు, ప్రవీణ్, రుమాన బేగం, గ్రామ రైతులు ఆర్బీకే ఇంచార్జిలు పాల్గొన్నారు.